పుట్టినరోజున విద్యార్థులకు మొక్కలు పంచిన లేడీ టీచర్.. వైరల్ వీడియో

Sat,July 6, 2019 06:44 PM

teacher distributes plants for her birthday video goes viral

సాధారణంగా పుట్టిన రోజు అంటేనే చాలు.. కేకులు కట్ చేసి... దాన్ని పుట్టిన రోజు జరుపుకుంటున్న వాళ్ల ముఖానికి పూసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు కొందరు. ముఖ్యంగా యూత్ అయితే.. పుట్టిన రోజు కేక్‌ను ముఖాలకు పూసుకొని వేస్ట్ చేస్తుంటారు. సరే.. వాళ్లకు అదో ఎంజాయ్‌మెంట్.

అయితే.. ఈ లేడీ టీచర్ మాత్రం.. తన పుట్టిన రోజు నాడు.. అందరిలా కేక్ కట్ చేయలేదు. అందరిలా కేక్‌ను తన ముఖానికి పూసుకోలేదు. తన స్కూల్‌లోనే పర్యావరణహితంగా తన పుట్టిన రోజును జరుపుకున్నది. స్కూల్‌లోని విద్యార్థులందరికీ తలా ఓ మొక్కను అందజేసింది. మొక్కతో పాటు ఓ చాకొలేట్‌ను కూడా ఇచ్చింది. పిల్లలందరికీ మొక్కలను ఇచ్చి వాళ్ల ఇంటి వద్ద నాటాలని సూచించింది. సూపర్ కదా. తన పుట్టిన రోజు నాడు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్న ఆ టీచర్.. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను విద్యార్థులకు చక్కగా వివరించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


2907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles