బట్టలకు ఆ మరకలు.. తిట్టిన టీచర్.. ఆత్మహత్య..

Wed,August 30, 2017 12:02 PM

Teacher Called Her Out For Menstrual Blood She Killed Herself

చెన్నై : ఓ విద్యార్థినిపై తాను మహిళనే కదా అనే విషయం మరిచి క్రూరంగా ప్రవర్తించింది ఓ టీచర్. విద్యార్థినికి రుతుస్రావం రావడంతో.. బట్టలకు రక్తపు మరకలు అంటాయి. దీంతో తరగతి గదిలోనే టీచర్ కోపోద్రిక్తులై.. ఆ అమ్మాయిని టార్చర్ పెట్టింది. సూటిపోటి మాటలతో మానసికంగా విద్యార్థినిని హింసించింది టీచర్. తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత అమ్మాయి(12) 25 అడుగుల ఎత్తులో ఉన్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలోని తిరునేల్‌వెల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. టీచర్ వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితురాలు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

1754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles