బీజేపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

Fri,July 12, 2019 03:41 PM

TDP MLC Annam Satish Prabhakar  joins BJP in the presence of Working President Jagat Prakash Nadda.

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో అన్నం సతీష్ కాషాయ కండువా కప్పుకున్నారు. జేపీ నడ్డా ఈ సందర్భంగా సతీష్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో సతీష్ నిన్న భేటీ అయిన విషయం తెలిసిందే.

2014లో బాపట్ల టీడీపీ అభ్యర్థిగా సతీష్ పోటీచేసి ఓడిపోయినప్పటికీ అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయన 2019లోనూ పోటీచేసి ఓటమిపాలయ్యారు. పార్టీ క్రియాశీలక సభ్యునిగా ఉన్న సతీష్.. ఫలితాలు వెల్లడైన నాటి నుంచి టీడీపీ శ్రేణులకు దూరంగా ఉంటూ వచ్చారు.

1638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles