చరిత్ర సృష్టించిన టీసీఎస్

Mon,April 23, 2018 01:09 PM

TCS makes history by becoming first Indian company to breach 100 billion dollar market capitalization

ముంబై: దేశంలోని అతిపెద్ద ఐటీ ఔట్‌సోర్సింగ్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చరిత్ర సృష్టించింది. 100 బిలియన్ డాలర్ల (రూ.6.62 లక్షల కోట్లు) మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కలిగిన తొలి భారత కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ప్రస్తుతం టీసీఎస్ షేరు విలువ రూ.3545గా ఉంది. సోమవారం ఉదయం షేరు ధర 4 శాతం పెరిగి ఆల్‌టైమ్ హైని తాకింది. దీంతో మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్లను దాటింది. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన కంపెనీ మొత్తం షేర్లను, ప్రస్తుత షేరు ధరతో గుణిస్తే వచ్చేది మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ. సోమవారం ఉదయం టీసీఎస్ సంస్థ విలువ రూ.6,79,332 కోట్లుగా ఉంది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి టీసీఎస్ ఎం-క్యాప్ 99 బిలియన్ డాలర్ల కంటే కాస్త ఎక్కువగా ఉంది. శుక్రవారం కూడా టీసీఎస్ షేర్లు 6 శాతం పెరిగాయి. నాలుగో త్రైమాసికంలో సంస్థ లాభాలు 4.5 పెరగడంతో కంపెనీ షేరు ధర ఒక్కసారిగా పెరిగిపోయింది.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles