ప్రపంచాన్ని చుట్టొచ్చిన‌ 'తరణి' టీమ్

Mon,May 21, 2018 04:40 PM

Tarini women team circumnavigates successfully, reaches goa port

పనాజీ: ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసల్(ఐఎన్‌ఎస్‌వీ) తరణిలో ప్రపంచ యానం చేసిన భారత నౌకాదళానికి చెందిన ఆరు మంది మహిళలు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఎనిమిది నెలల క్రితం గోవా తీరం నుంచి బయలుదేరిన మహిళా నావికులు.. ఇవాళ మళ్లీ గోవాకు వచ్చారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ .. పనాజీలో వాళ్లకు స్వాగతం పలికారు. గత ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన గోవా నుంచి వీళ్ల టూర్ ప్రారంభమైంది. సముద్ర మార్గం ద్వారా మన మహిళలు.. ప్రపంచాన్ని చుట్టేశారు. అడ్మిరల్ లాంబ కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు. నావికా సాగర్ పరిక్రమ పేరుతో టూర్ చేశారు. లెఫ్టినెంట్ కమాండర్ వార్తికా జోషితో పాటు మరో అయిదుగురు ఈ ట్రిప్‌లో ఉన్నారు. కమాండర్లు ప్రతిబా జమ్‌వాల్, స్వాతి పి, లెఫ్టినెంట్ ఐశ్వర్య బోడపాటి, ఎస్ విజయదేవి, పాయల్ గుప్తాలు.. సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టువచ్చారు. కెప్టెన్ దిలీప్ దోండే అనే ఆఫీసర్ .. ఈ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇచ్చారు. దిలీప్ దొండే.. 2009-10 మధ్య కాలంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చారు. తరుణి సముద్ర ప్రయాణం ఆరు భాగాలు సాగింది. ఆస్ట్రేలియాలోని ఫ్రెమాంటిల్, న్యూజిలాండ్‌లోని లిటెల్టన్, ఫాక్ ఐలాండ్స్‌లోని పోర్ట్ స్టాన్లీ, సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్, మారిషస్‌లో.. తరణి నావికులు స్టాప్ తీసుకున్నారు. వీళ్లు మొత్తం 21,600 నాటికల్ మైళ్లు ప్రయాణం చేశారు.1075
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS