దమ్ముంటే బస్సును టచ్ చేయండి.. సింగం, సింబాలను మించిన పోలీసు.. వీడియో

Sat,January 5, 2019 05:04 PM

మీకు సింబా, సింగం గుర్తున్నారా? వీళ్లు సినిమాల్లోని పోలీసులు. కానీ.. సింబా, సింగం.. ఈ ఇద్దరు పోలీసులను తలదన్నే పోలీసు ఈయన. ఎందుకంటే.. ఒక్కడే కేరళ ఆందోళనకారులను నిలువరించగలిగాడు. ఇప్పుడు కేరళలో ఎక్కడ చూసినా ఆందోళనలే కదా. జనవరి 2 న ఇద్దరు మహిళలు శబరిమల గుడిలోకి వెళ్లడంతో గుడి వివాదం ఇంకాస్త ముదిరింది. మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్న ఆందోళనకారులు కేరళలో హర్తాల్ నిర్వహించారు. ఆందోళనలు చేపడుతున్నారు.


తమిళనాడు-కేరళ బార్డర్‌లోని కలియక్కవిలాయ్ అనే టౌన్‌లో కూడా ఆందోళనకారులు రోడ్డు మీదికొచ్చి విధ్వంసం సృష్టించబోయారు. రోడ్డు మీద వెళ్తున్న కేఎస్‌ఆర్‌టీసీ(కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్)కు చెందిన బస్సును ఆపి దానిపై రాళ్లు విసిరేయబోయారు. బస్సు డ్రైవర్‌పై దాడి చేయబోయారు. అంతలోనే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై మోహన్ అయ్యర్ బస్సు దగ్గర ఉన్న ఆందోళనకారుల గుంపును చూసి అక్కడికి వెళ్లి వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. వాళ్లు వినలేదు. దీంతో మీరు మనుషులైతే.. మీకు దమ్ముంటే బస్సును ముట్టుకోండి.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతే.. దెబ్బకు ఆందోళనకారులంతా అక్కడి నుంచి తుర్రుమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఆ ఎస్సైని సింగం, సింబాలను తలదన్నేలా ఉన్నాడు ఈ పోలీసు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న కేఎస్‌ఆర్‌టీసీ ఎండీ థచంకరీ ఆ ఎస్సైని మెచ్చుకుంటూ రివార్డుగా ఓ వెయ్యి రూపాలతో పాటు.. ప్రశంసా పత్రాన్ని పంపించాడు.

11495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles