నిరాహార దీక్షలో కూర్చొని ఆశ్చర్యపరిచిన సీఎం, డీప్యూటీ సీఎం!

Tue,April 3, 2018 02:48 PM

Tamilnadu CM and Deputy CM surprise all with Hunger Strike

చెన్నై: తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు నిరాహార దీక్షలు చేస్తున్నాయి. అయితే చెన్నైలోని చెపాక్ సమీపంలో జరుగుతున్న నిరాహార దీక్షలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం కూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి అక్కడ దీక్ష చేస్తున్న వాళ్ల జాబితాలో ఈ ఇద్దరి పేర్లు లేవు. కనీసం పోలీసులు, పార్టీ నేతలకు కూడా తెలియకుండా వాళ్లిద్దరూ హఠాత్తుగా వచ్చి దీక్షలో కూర్చుకున్నారు.

ప్రతిపక్ష డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు నిరాహారదీక్షకు రావడం చర్చనీయాంశమైంది. వాళ్లు వచ్చి దీక్షలో కూర్చునేంత వరకు కూడా ఇక్కడికి వస్తారని తమకు తెలియదని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. సీఎం, డీప్యూటీ సీఎం రావడంతో అధికారులు, పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి జయకుమార్, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి వచ్చారు.

2605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles