క్రికెట్‌ వరల్డ్‌ కప్.. అచ్చం జ్యోతిష్యుడు చెప్పినట్లే జరిగింది..!

Fri,July 12, 2019 06:35 PM

ఈ ప్రపంచ కప్ విజేత ఎవరో తెలుసా మీకు. అప్పుడే ఎలా తెలుస్తుంది. ఇంకా ఫైనల్స్ జరగాలి కదా అంటారా? కానీ.. ఓ జ్యోతిష్యుడు మాత్రం ఆరు నెలల కిందనే ప్రపంచ కప్ విజేత ఎవరో చెప్పేశారు. న్యూజిలాండ్ ఈసారి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోతుందని ఆయన ఊహించారు. అంతే కాదు.. భారత్ సెమీస్‌లో ఓడిపోతుందని కూడా ఆయన చెప్పారు. ఆయన ప్రపంచ కప్ గురించి చెప్పింది చెప్పినట్టే జరుగుతుండటంతో ఆ జ్యోతిష్యుడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.


ఆయనే తమిళనాడుకు చెందిన బాలాజి హాసన్. ఆయన వృత్తిరీత్యా మెకానికల్ ఇంజినీర్. అప్పుడప్పుడు జ్యోతిష్యాలు కూడా చెబుతుంటారట. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ఓ తమిళ టీవీ చానెల్‌లో వచ్చిన కార్యక్రమంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

సెమీస్‌కు నాలుగు జట్టు.. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేరుకుంటాయని ఆయన చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. నిజంగానే ఆ నాలుగు జట్లే సెమీస్‌కు చేరాయి. సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని.. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. అది నిజంగానే జరిగింది. మరో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంటుందని ఊహించారు. అలాగే జరిగింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కేన్ విలియమ్సన్‌కు వరిస్తుందన్నారు. చూద్దాం.. ఫైనల్‌లో న్యూజిలాండ్ గెలిచి.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కేన్ విలియమ్సన్‌కు వరిస్తే.. ఆయన చెప్పింది వంద శాతం జరిగినట్టే.

ఈ జ్యోతిష్యుడు.. కేవలం క్రికెట్ మీదనే కాదు.. రాజకీయాల మీద కూడా చెబుతుంటారు. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 2022లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తారట. 2024 తర్వాత ఆయన రాజకీయాల్లో ఉండబోరంటూ ఓ ఇంటర్వ్యూలోనూ వెల్లడించారు. అంతేకాదు.. కర్ణాటక రాజకీయ సంక్షోభం గురించి కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

8049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles