టీచర్‌ హత్య.. తరగతి గది రక్తసిక్తం..

Fri,February 22, 2019 04:04 PM

Tamil Nadu Man Kills Teacher In Classroom Allegedly For Rejecting Him

చెన్నై : తనను పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో 23 ఏళ్ల యువతిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైకి 200 కి.మీ. దూరంలోని కుడలూరు జిల్లాలో ఇవాళ చోటు చేసుకుంది. ఎస్‌. రమ్య(23) అనే యువతి.. గాయత్రి మెట్రిక్యులేషన్‌ స్కూల్లో గణితం టీచర్‌గా పని చేస్తోంది. ఐదో తరగతికి గణితం బోధిస్తున్న సమయంలో ఓ ఉన్మాది క్లాస్‌రూంలోకి ప్రవేశించి రమ్యపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తరగతి గది అంతా రక్తసిక్తమైంది. విద్యార్థులు భయంతో వణికిపోయారు.

పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రమ్యను హత్య చేసిన వ్యక్తిని రాజశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. రమ్య, రాజశేఖర్‌ కాలేజీ ఫ్రెండ్స్‌ అని, ఆరు నెలల క్రితం రమ్యతో తన వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులను అతడు కోరాడు. ఇందుకు రమ్య తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. అప్పట్నుంచి కక్ష పెంచుకున్న రాజశేఖర్‌.. ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. రమ్యను హత్య చేసిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరికి రాజశేఖర్‌ మేసేజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

4393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles