రేపు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

Tue,August 7, 2018 09:46 PM

Tamil Nadu govt announced holiday tomorrow

చెన్నై: కరుణానిధి మృతిపట్ల తమిళనాడు ప్రభుత్వం సంతాపం ప్రకటిస్తూ రాష్ట్రంలో రేపు సెలవును ప్రకటించింది. గోపాలపురంలోని నివాసంలో కరుణానిధి భౌతికకాయాన్ని ఉంచారు. ప్రజల సందర్శనార్థం రారాజీహాల్‌లో భౌతికకాయం ఉంచే అవకాశం. కాగా కరుణానిధి అంత్యక్రియలపై వివాదం నెలకొంది. అన్నాదురై సమాధి వద్ద కరుణానిధికి సమాధి ఏర్పాటు చేయాలని డీఎంకే కోరింది. అన్నాదురై సమాధి వద్ద ఖననం చేసేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో అంత్యక్రియలకు అనుమతి నిరాకరణపై డీఎంకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాత్రి 10.30 గంటలకు మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నారు.

3547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles