నోబెల్‌కు ప్రధాని మోదీ పేరు నామినేట్

Tue,September 25, 2018 12:00 PM

Tamil Nadu BJP Chief Nominates PM Modi For Nobel Peace Prize

చెన్నై : 2019 ఏడాదికి గానూ ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసాయి సౌందర్‌రాజన్, ఆమె భర్త ప్రొఫెసర్ డాక్టర్ పి. సౌందర్ రాజన్ కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్‌కు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మోదీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వారు కోరారు. నోబెల్‌కు పేర్లను నామినేట్ చేసేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో ప్రక్రియ ప్రారంభమవుతోంది. నామినేషన్ల ప్రక్రియ 2019, జనవరి 31న ముగుస్తుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పార్లమెంట్ సభ్యులందరూ మోదీ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ చేయాలని సౌందర్ రాజన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల దేశంలోని పేదలందరికి మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.

2617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles