తమిళం మా మాతృ భాష: కమల్‌హాసన్‌

Mon,September 16, 2019 07:42 PM

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ తమిళభాషపై తమకు గల మక్కువను తెలియజేశారు. కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌ షా ఇటీవల భాషపై చేసిన ప్రకటన.. ఒకే దేశం ఒకే భాష అనే నినాదంపై తమిళులు రగిలిపోతున్నారు. వారికి మద్దతుగా కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా మేం చెబుతూనే ఉన్నాం. తమిళం మాకు గర్వకారణమని నొక్కి చెబుతున్నా కేంద్రానికి పట్టనట్టుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తమిళ భాషను వదులుకోం.


తమిళం అతి పురాతనమైన, గౌరవమైన భాష. మా మాతృ భాషను వదులుకోలేమని మేము ప్రతిజ్ఞ చేశాం. అన్ని భాషలను అంఘీకరించడానికి మేము సిద్దంగా ఉన్నాం. కానీ హిందీనే మొదటి భాషగా ఎంచుకొమ్మని ఒత్తిడి తెస్తే ఊరుకోమని ఆయన అన్నారు.


1264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles