మంచాలు తీసుకెళ్లడం దొంగ‌త‌న‌మైతే.. మాల్యా సంగ‌తేంటి?

Thu,September 8, 2016 10:47 AM

Taking Cots Is Stealing.. What About Vijay Mallya, Asks Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కొత్త త‌ర‌హాలో కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. మొన్న ఆయ‌న స‌భ‌లోనే వేసిన మంచాల‌ను గ్రామ‌స్థులు ఎత్తుకెళ్ల‌డంపై స్పందించారు. మంచాలు ఎత్తుకెళ్తేనే దొంగ‌ల‌ని అంటున్నారు.. 9 వేల కోట్లు ఎగ‌నామం పెట్టి పారిపోయిన పారిశ్రామిక‌వేత్త‌ల‌ను మాత్రం డీఫాల్ట‌ర్లు (ఎగ‌వేత‌దారు) అంటున్నారంటూ ప‌రోక్షంగా లిక‌ర్ బార‌న్ విజ‌య్ మాల్యాను, ఆయ‌న‌ను వెన‌క్కి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మైన కేంద్ర స‌ర్కారును విమ‌ర్శించారు. ఎన్డీఏ ప్ర‌భుత్వం రైతుల‌ను వ‌దిలి కార్పొరేట్ల కోసం ప‌నిచేస్తోందంటూ రాహుల్ ఆరోపించారు.

మొన్న యూపీలో తొలిరోజు కిసాన్ యాత్ర సంద‌ర్భంగా దేవ‌రియాలో జ‌రిగిన స‌భ‌లో కొత్త‌గా మంచాలు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌భ ముగియ‌గానే అక్క‌డి గ్రామ‌స్థులు ఆ మంచాల‌ను ప‌ట్టుకెళ్లారు. ఆ ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తూ రాహుల్ ప‌రోక్షంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన తీరు స‌భకు వ‌చ్చిన వారిని ఆక‌ట్టుకుంది. కిసాన్ యాత్ర‌, ఖాట్ స‌భ‌లంటూ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. రాహుల్‌గాంధీ స‌భ‌ల‌కు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. 27 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ యూపీని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈసారి కాంగ్రెస్ పావులు క‌దుపుతోంది.

1598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles