ప‌టేల్ హెల్ప్ చేశారు.. మోదీ నిర్వీర్యం చేస్తున్నారు..

Wed,October 31, 2018 04:43 PM

systematic destruction of India's institutions is nothing short of treason, tweets Rahul Gandhi

న్యూఢిల్లీ: గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దిపై స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ పటేల్ విగ్ర‌హాన్ని ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆవిష్క‌రించారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన విగ్ర‌హంగా ఇది రికార్డు బ‌ద్ద‌లు కొట్టింది. సుమారు 3వేల కోట్ల‌తో దీన్ని నిర్మించారు. ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌గానే.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న మోదీ నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌ట్టారు. ప‌టేల్ స్టాచ్యూను మోదీ ఆవిష్క‌రించ‌డం విచిత్రంగా ఉంద‌ని, దేశంలో కొన్ని సంస్థ‌ల అభివృద్ధికి ప‌టేల్ స‌హ‌క‌రించార‌ని, కానీ ఆ సంస్థ‌ల‌ను మోదీ నాశ‌నం చేస్తున్నార‌ని రాహుల్ ఆరోపించారు. చాలా వ్యూహాత్మ‌కంగా స్వ‌యంప్ర‌తిప‌త్తి సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్నార‌ని, ఇదొక‌ర‌కంగా దేశ ద్రోహామే అని రాహుల్ విమ‌ర్శించారు. సీబీఐ, ఆర్బీఐ సంస్థ‌లు వివాదాల‌కు కేంద్ర బిందువు కావ‌డంతో రాహుల్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.1488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles