ఉద్యోగాల పేరుతో మోసం..స్వీట్ షాప్ ఎండీ అరెస్ట్

Thu,May 16, 2019 07:23 PM

Sweet shop MD arrested for cheating job aspirants


కోయంబత్తూర్: ఉద్యోగాల పేరుతో మోసం చేసిస స్వీట్ షాపు మేనేజింగ్ డైరెక్టర్‌ను కోయంబత్తూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరులో పేరుగాంచిన ప్రముఖ స్వీట్ హౌజ్ ను నిర్వహిస్తున్న టీఎస్సార్ బాలచంద్రన్..తన షాపులో మేనేజర్, అకౌంటెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయని, వాటికి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన ఇచ్చారు. దీంతో సుమారు 160 మంది దరఖాస్తు పెట్టుకున్నారు.

అయితే బాలచంద్రన్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.32 లక్షలు వసూలు చేశాడు. కానీ దరఖాస్తు పెట్టుకున్న వారికి ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. ఉద్యోగం కోసం ప్రశ్నించిన వారిపై బాలచంద్రన్ బెదిరింపులకు దిగడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలచంద్రన్‌ను అరెస్ట్ చేసి..విచారణ కొనసాగిస్తున్నారు.

1803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles