బీజేపీ కార్యకర్త హత్యకేసు..అనుమానితులు అరెస్ట్

Sun,May 26, 2019 03:23 PM

Suspects arrested in smriti irani aide murder case


అమేథీ: ఉత్తరప్రదేశ్‌లోని బరౌలియా గ్రామ మాజీ సర్పంచ్‌, బీజేపీ క్రీయాశీల కార్యకర్త సురేంద్రసింగ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే విచారణ వేగవంతం చేసిన యూపీ పోలీసులు యూపీ పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సురేంద్రసింగ్ కేసుకు సంబంధించిన కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేశాం. వారి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని అమేథీ ఎస్పీ రాజేశ్ కుమార్ తెలిపారు. అమేథీ నియోజకవర్గంలోని సురేంద్ర సింగ్‌ అనే బీజేపీ కార్యకర్తపై కొందరు దుండగులు ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరుపగా..తీవ్ర గాయాలతో మృతి చెందిన విషయం తెలిసిందే.

1461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles