సంపద నుంచి సన్యాసం.. అక్కాతమ్ముల నిర్ణయం

Tue,October 23, 2018 04:33 PM

surat sister and brother opt for sanyas

వారు కావాలనుకుంటే విలాసవంతమైన జీవితం గడపొచ్చు. కానీ సన్యాసమే మేలని మనస్ఫూర్తిగా ఎంచుకున్నారు. సూరత్‌కు చెందిన వస్ర్తాలవ్యాపారి భరత్ వోరా (57) కుమార్తె ఆయుషి వోరా (22), కుమారుడు యష్ వోరా (20) జైన సన్యాసులుగా మారాలని నిర్ణయించుకున్నారు. హైస్కూలు చదువు పూర్తి కాగానే ఇద్దరూ సన్యాస జీవితానికి శిక్షణ పొందేందుకు గురుశుశ్రూష చేశారు. టూవీలర్లు, కార్లలో తిరిగిన ఆ అక్కాతమ్ములు ఇకనుంచి పదయారులుగా జీవనం సాగించాల్సి ఉంటుంది. పంచభక్ష్య పరమాన్నాల స్థానంలో భిక్షాన్నం భుజించాల్సి ఉంటుంది. అయితే ఇదేదో తమకుతామే తీసుకున్న నిర్ణయం కాదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే వారు ఈ మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. అమ్మ నన్ను పెండ్లి చేసి పంపడం కన్నా మాతాజీగా చూడాలనే కోరుకుంది అని ఆయుషీ చెప్పారు. తండ్రి వ్యాపారంలో కొన్నాళ్లు పనిచేసినా తనకు ఆ జీవితం తృప్తి ఇవ్వలేదని, సన్యాసమే తనకు నచ్చిందని యష్ చెప్పారు. తమ ఊళ్లోని అన్ని కుటుంబాల్లో ఇంటికొక సన్యాసి ఉన్నారని, తన కుటుంబమే అందుకు మినహాయింపు అని భరత్ చెప్పారు. ఇప్పుడు పిల్లల నిర్ణయం వల్ల తమకు ఆ లోటు తీరిందని పేర్కొన్నారు. డిసెంబర్ 9న వారికి సన్యాస దీక్ష ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.

3011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles