మహిళను నమ్మించి మోసం చేసిన పూజారి

Wed,October 24, 2018 04:18 PM

Surat priest arrested for raped a women

సూరత్: డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓ ఆలయ పూజారి మహిళను నమ్మించి..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని కాటర్‌గామ్ పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. డభోలి ప్రాంతంలోని స్వామినారాయణ్ ఆలయంలో నికుంజ్ అలియాస్ కరణ్‌స్వరూప్‌దాస్ బాబుబాయి సావని (24)పూజారిగా పనిచేస్తున్నాడు. 20 ఏండ్ల యువతి తల్లికి ఆపరేషన్ చేయించాల్సి ఉంది. తల్లికి ఆపరేషన్ చేయించేందుకు ఆ యువతి దగ్గర డబ్బు లేదు. నికుంజ్ దగ్గరకు వెళ్తే ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు సాయం చేస్తారని ఓ వ్యక్తి సదరు యువతికి సలహా ఇచ్చాడు. దీంతో ఆ యువతి నికుంజ్ దగ్గరకు వెళ్లింది.

డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పిన నికుంజ్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అతడు డబ్బులు ఇవ్వలేదు. ఆ యువతి అక్టోబర్ 23న డబ్బుల కోసం వెళితే నికుంజ్ ఆమెపై మరోసారి అత్యాచారం చేశాడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నికుంజ్‌ను అరెస్ట్ చేశామని స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎమ్‌ఐ పఠాన్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనాస్థలానికి వెళ్లి దర్యాప్తు కొనసాగిస్తోంది.

4079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles