6690 వజ్రాలతో ఉంగరం.. ప్రపంచ రికార్డు.. వీడియో

Fri,June 29, 2018 11:43 AM

Surat diamond jewellers create new Guinness World Record with a Diamond Ring

సూరత్: ఇండియాలో వజ్రాలకు ఫేమసైన సూరత్ ఓ కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డుకు వేదికైంది. విశాల్ అగర్వాల్, ఖుష్బు అగర్వాల్ అనే ఇద్దరు వజ్రాల వ్యాపారులు ఈ రికార్డును నెలకొల్పారు. కమలం ఆకారంలో ఉన్న ఓ ఉంగరంలో 6690 వజ్రాలు పొదిగి రికార్డును సొంతం చేసుకున్నారు. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ రింగ్‌లో 48 డైమండ్లతో పొదిగిన రేకులు ఉన్నాయి. ఈ ఉంగరం ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.28 కోట్లు. 58 గ్రాముల బరువున్న ఈ ఉంగరాన్ని తయారు చేయడానికి ఆరు నెలలు పట్టడం విశేషం.


నీటిని పరిరక్షించాలన్న సందేశం ఇవ్వడానికి తాము ఈ రికార్డు కోసం ప్రయత్నించామని విశాల్, ఖుష్బు చెప్పారు. భారత జాతీయ పుష్పం కమలం కావడంతో ఆ ఆకారంలో రింగును తయారు చేశామని, పైగా ఇది నీటిలో ఉండే ఓ అద్భుతమైన పువ్వు అని వాళ్లన్నారు. ఈ రింగుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ వాళ్లు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.

3299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles