ఉద్యోగులకు దివాలీ గిఫ్ట్.. 600 కార్లు ఇవ్వనున్న బిలియనీర్

Thu,October 25, 2018 01:22 PM

Surat billionaire Savji Dholakia to gift 600 cars to companys employees

న్యూఢిల్లీ: సూరత్‌కు చెందిన బిలియనీర్ డైమండ్ వ్యాపారి సావ్‌జీ ఢోలాకియా ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా తమ ఉద్యోగులకు దీపావళికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు. హరే కృష్ణ ఎక్స్‌పోర్టర్స్ యజమాని అయిన ఢోలాకియా.. ఈ ఏడాది 600 మంది ఉద్యోగులకు దివాలీ గిఫ్ట్‌లు సిద్ధం చేశారు. ఇక మరికొందరు ఉద్యోగులకు నగలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఢోలాకియా ఏకంగా మెర్సెడీజ్ బెంజ్ జీఎల్‌ఎస్ 350డీ ఎస్‌యూవీలను గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు.

కంపెనీలో అత్యుత్తమంగా పని చేసిన ఉద్యోగులకు గతంలోనూ వేల కొద్దీ కార్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చారు ఢోలాకియా. అసలు హరేకృష్ణ ఎక్స్‌పోర్టర్స్‌లో దీపావళికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నది. సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలీ జిల్లా దుదాలా గ్రామానికి చెందిన ఢోలాకియా.. తన మామ దగ్గర అప్పు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నారు. గతంలో ఈయన కొడుకే కేరళలో నెల రోజుల పాటు ఓ సాధారణ వ్యక్తి జీవితం గడిపి వార్తల్లో నిలిచాడు.

6415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles