377 సెక్ష‌న్‌పై రేపే తుది తీర్పు !

Wed,September 5, 2018 06:50 PM

Supreme Court to pronounce verdict on fate of Section 377 tomorrow

న్యూఢిల్లీ: స్వ‌లింగ సంప‌ర్కం నేర‌మా కాదా. ఈ అంశాన్ని గురువారం సుప్రీంకోర్టు తేల్చ‌నున్న‌ది. వివాదాస్ప‌ద 377 సెక్ష‌న్‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం చ‌రిత్రాత్మ‌క తీర్పును ఇవ్వ‌నున్న‌ది. ఐపీసీలోని 377 సెక్ష‌న్ ప్ర‌కారం స్వ‌లింగ సంప‌ర్కం నేరం. దాన్ని స‌వాల్ చేస్తూ అనేక పిటీష‌న్లు సుప్రీంలో దాఖ‌లు అయ్యాయి. సెక్ష‌న్ 377కు రాజ్యాంగ నిబ‌ద్ద‌త ఉందా లేదా అన్న అంశాన్ని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం సెప్టెంబ‌ర్ 6వ తేదీన తేల్చ‌నున్న‌ది.

స్వలింగ సంపర్కం నేరమా కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టులో చాన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. స్వలింగ సంపర్కం అంశంపై తాము ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని, సుప్రీంకోర్టు విచక్షణకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం ఇటీవ‌ల తెలిపింది. సెక్ష‌న్‌ 377ను రద్దు చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్థనలపై సుప్రీం సీనియర్ జడ్జిలు విచారణ చేపడుతున్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం ఒకవేళ ఎవరైనా స్వలింగ సంపర్కానికి పాల్పడితే వాళ్లకు జీవిత కాల జైలు శిక్షను విధిస్తారు.

జూలైలో కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది తుషార్ మెహత తన అభిప్రాయాన్ని వినిపించారు. స్వలింగ సంపర్కం కేసులో కోర్టు విచక్షణకే నిర్ణయాన్ని వదిలేస్తున్నామన్నారు. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా స్పందించారు. 377 సెక్ష‌న్‌ ప్రకారం స్వలింగ సంపర్కం నేరమనా లేక దాన్ని నేరంగా పరిగణించరాదు అన్న నిర్ణయాన్ని తమకే వదిలేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

4509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles