మా ఆదేశాలతో ఆడుకోకండి.. దేవుడే మిమ్మల్ని కాపాడాలి!

Thu,February 7, 2019 04:09 PM

Supreme Court summons CBI interim director Nageshwar Rao over Bihar Shelter Home case

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం నాగేశ్వర్‌రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసును చూస్తున్న అధికారి ఏకే శర్మను బదిలీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మీరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో ఆడుకున్నారు. దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎప్పుడూ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆడుకోకండి అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణ కింద నాగేశ్వర్‌రావుకు నోటీసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ నెల 12న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఏకే శర్మను బదిలీ చేసిన ప్రక్రియలో ఇంకా ఏ అధికారులు ఉన్నారో వాళ్ల పేర్లు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసును గురువారం ఉదయం ఢిల్లీలోని సాకేత్ పోక్సో కోర్టుకు సుప్రీం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లో విచారణ పూర్తి కావాలని ఆదేశించింది. గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని స్పష్టం చేసింది.

2252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles