యధావిధిగా గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు..

Mon,July 22, 2019 12:41 PM

supreme court rejected a petition filled on Group 2 Interviews

న్యూఢిల్లీ : టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌ -2 ఇంటర్వ్యూలు యధావిధిగా కొనసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గానే ఉన్నాయని, తమ జోక్యం అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఈ సమస్యను ఇంతటితో ముగిద్దామని జస్టిస్‌ చంద్రచుడ్‌, జస్టిస్‌ ఇంద్రా బెనర్జీల ధర్మాసనం అభిప్రాయపడింది.

వైట్నర్‌, రాంగ్‌ బబ్లింగ్‌ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో గ్రూప్‌-2 నియామకాల ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 1,032 పోస్టులకు గానూ 2,142 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు నిర్వహిస్తోంది టీఎస్‌పీఎస్సీ. సాధారణ అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, దివ్యాంగుల కోటాలో 1:5 నిష్పత్తి చొప్పున అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. జులై 1వ తేదీన ప్రారంభమైన గ్రూప్‌ ఇంటర్వ్యూలు.. మరో నాలుగు రోజుల పాటు(జులై 26) కొనసాగనున్నాయి.

701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles