అయోధ్యపై మధ్యవర్తిత్వం..సభ్యుల్లో శ్రీశ్రీ రవిశంకర్

Fri,March 8, 2019 12:01 PM

Supreme Court orders to Mediation panel for Ayodya Dispute


న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వ ప్యానెల్ ద్వారా సమస్య పరిష్కరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్ ను సుప్రీంకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఖలీపుల్లా ప్యానెల్ కు ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు ను నియమించింది.

మధ్యవర్తిత్వ ప్రక్రియ 4 వారాల్లోగా ప్రారంభించి..8 వారాల్లోగా పూర్తి చేయాలని సీజేఐ రంజన్ గొగోయ్ తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. మధ్యవర్తిత్వ ప్రక్రియ వివాదానికి పరిష్కారానికి ఉపయోగపడొచ్చని బెంఛ్ అభిప్రాయపడింది. స్నేహపూర్వకంగా ఈ వివాదానికి పరిష్కారం దొరికేందుకు ఒక శాతం అవకాశమున్నా..పార్టీలు మధ్యవర్తిత్వానికి వెళ్లాలని సూచనలు చేసింది.

970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles