ఆమ్ర‌పాలి క‌స్ట‌మ‌ర్ల‌కు సుప్రీం ఊర‌ట‌

Tue,July 23, 2019 12:15 PM

Supreme Court orders action against Amrapali, Provides relief to Homebuyers

హైద‌రాబాద్‌: ఆమ్ర‌పాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇండ్ల కోసం వేచి చూస్తున్న సుమారు 40 వేల మందికి ఊర‌ట క‌ల్పిస్తూ ఇవాళ సుప్రీం తీర్పునిచ్చింది. కంపెనీకి చెందిన రెరా రియ‌ల్ ఎస్టేట్ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని కోర్టు చెప్పింది. అసంపూర్ణంగా నిలిచిపోయిన నిర్మాణాల‌ను పూర్తి చేసేందుకు నేష‌న‌ల్ బిల్డింగ్స్ అండ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కార్పొరేష‌న్‌(ఎన్‌బీసీసీ)కి ఆదేశాలు ఇచ్చింది. క‌స్ట‌మ‌ర్ల సొమ్మును దుర్వినియోగం చేసిన కేసులో ఆమ్ర‌పాలి గ్రూపు ఓన‌ర్ల‌ను మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో విచారించాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ను కోర్టు ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లుగా ఉన్న అనిల్ కుమార్ శర్మ, శివ్ ప్రియ, అజయ్ కుమార్‌లు పోలీస్ కస్టడీలోనే ఉండాల్సిందిగా గ‌తంలోనే అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమ్రపాలి గ్రూప్ నుంచి దాదాపు 42,000 ఫ్లాట్లను కోరుతున్న గృహ కొనుగోలుదారుల్లో కొందరు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే గ్రూప్ డైరెక్టర్ల వ్యవహార శైలిని ధర్మాసనం తప్పుబట్టింది. ఆరు నెలల నుంచి మూడేండ్లలో ఆమ్రపాలి గ్రూప్‌లో నిలిచిన 15 రెసిడెన్షియల్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, ఇందుకు రూ.8,500 కోట్ల వ్యయం అవుతుందని ఓ ప్రతిపాదననూ గ‌తంలో ఎన్‌బీసీసీ కోర్టుకు సమర్పించింది. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో రూ.847 కోట్ల ఆస్తుల్ని ప్రకటించిన ఆమ్రపాలి గ్రూప్ సీఎండీ.. ఇప్పుడు రూ.67 కోట్ల ఆస్తులనే చెబుతుండటంపైనా సుప్రీం దృష్టి సారించింది.

1005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles