ఈసీకి, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Mon,April 15, 2019 12:30 PM

ఢిల్లీ: ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విధులు నిర్వహించడంలో అలక్ష్యం వహిస్తున్నారాని నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ నియమావళికి సంబంధించిన నేతల వ్యాఖ్యలపై పరిశీలిస్తున్నామని ఈసీ సమాధానం ఇచ్చింది. నేతలపై వెంటనే చర్యలు తీసుకోలేమని ఈసీ కోర్టుకు తెలిపింది. ఈసీ సమాధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాయావతి, యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్‌ దాఖలైంది. అధికారులను ఈసీ పూర్తిగా వినియోగించుకోలేకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈసీ తరపున అధికారి రేపు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

2243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles