వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై 25న సమగ్ర విచారణ

Fri,March 15, 2019 11:39 AM

న్యూఢిల్లీ : వీవీప్యాట్ స్లిప్పుల అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ దేశంలోని 21 పార్టీలు కలిసి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ నెల 25న సమగ్రంగా విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం చెప్పింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో ఎన్నికల అధికారిని అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.

878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles