అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Mon,February 11, 2019 01:02 PM

supreme court issues notice to center on economically backward upper cast reservations

న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో ఏపీ రాష్ట్రం కాపులకు 5 శాతం ఇస్తున్నదని.. ఈబీసీ రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన కాదంటూ ఆర్ కృష్ణయ్య సుప్రీంలో పిటిషన్ వేశారు.

2758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles