ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్‌లు లెక్కించాల్సిందే

Mon,April 8, 2019 01:08 PM

Supreme Court increases VVPAT verification from one EVM per constituency to 5

న్యూఢిల్లీ : వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని కోర్టు ఆదేశించింది. ఒక్క ఈవీఎం వీవీప్యాట్‌ లెక్కింపును 5 వీవీప్యాట్‌లకు పెంచుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఒక్క అసెంబ్లీ స్థానంలో ఒక్క వీవీప్యాట్‌లోని స్లిప్పులనే లెక్కించి ఈసీ ధృవీకరిస్తుంది. ఇక నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌లను, ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలంటూ ఈసీకి కోర్టు ఆదేశాలిచ్చింది. స్లిప్పుల లెక్కింపు కోసం ఈవీఎంలను ర్యాండమ్‌గానే ఎంచుకోవాలని సూచించింది. ఈ విధానాన్ని రానున్న ఎన్నికల్లోనే అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles