మ‌మ‌తా బెన‌ర్జీ ఫోటో మార్ఫింగ్‌.. ప్రియాంకా శ‌ర్మ‌కు బెయిల్‌

Tue,May 14, 2019 12:20 PM

Supreme Court grants conditional bail to BJP youth wing worker Priyanka Sharma

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఫోటోను మార్ఫింగ్ చేసిన బీజేపీ యూత్ వింగ్ కార్య‌క‌ర్త ప్రియాంకా శ‌ర్మ‌కు ఇవాళ సుప్రీంకోర్టు ష‌రుత‌ల‌తో కూడిన బెయిల్‌ను మంజూరీ చేసింది. లిఖిత‌పూర్వంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌ర్వాత‌నే సుప్రీం త‌న తీర్పును వెలువ‌రించింది. సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ప్రియాంకా శ‌ర్మ‌.. దీదీకి చెందిన ఓ అభ్యంత‌ర‌క‌ర‌మైన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆమెను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. త‌న‌ను విడుద‌ల చేయాల‌ని ప్రియాంకా పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను మొద‌ట కోర్టు త్రోసిపుచ్చింది. మ‌మ‌తా బెన‌ర్జీకి క్ష‌మాప‌ణ‌లు చెబితేనే బెయిల్ ఇస్తామ‌ని కోర్టు చెప్పింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ కార్య‌క‌ర్త ప్రియాంకా.. దీదీకి సారీ చెప్పారు. క్ష‌మాప‌ణ కోరడం అంటే స్వేచ్ఛా హ‌క్కును ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ప్రియాంకా త‌ర‌పున న్యాయ‌వాది ఎన్‌కే కౌల్ కోర్టుకు తెలిపారు. అయినా కానీ కోర్టు ఆ విజ్క్ష‌ప్తిని వినిపించుకోలేదు.సుప్రీం తీర్పు త‌మ‌కు సంతోషాన్ని ఇచ్చింద‌ని ప్రియాంకా త‌ల్లి రాజ్ కుమారి శ్మ‌ర తెలిపారు.

1029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles