భీమా-కోరేగావ్ కేసు అత్యవసర విచారణకు సుప్రీం నో

Wed,October 24, 2018 11:39 AM

Supreme Court declines urgent hearing on Bhima Koregaon case

న్యూఢిల్లీ: భీమా- కోరేగావ్ కేసులో అత్యవసర విచారణలు అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. భీమా- కోరేగావ్ అల్లర్ల ఘటన అనంతరం పూణె పోలీసులు ఐదుగురు హక్కుల నేతలను అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ గతంలో కోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తు అవసరం లేదని పేర్కొంటూ హక్కుల నేతల గృహ నిర్భందాన్ని పొడిగించింది. సిట్ దర్యాప్తు నిరాకరణ అదేవిధంగా కేసు సత్వర విచారణ కోరుతూ రోమిల్లా థాపర్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరిస్తూ అత్యవసర విచారణ అవసరం లేదని పేర్కొంది. అదేవిధంగా మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని తెలిపింది.

604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles