100 కోట్లు డిపాజిట్ చేయాలని రియల్ సంస్థకు సుప్రీం ఆదేశం

Mon,April 16, 2018 03:12 PM

Supreme Court asks Jaiprakash Associates to deposit Rs 100 crore with its registry by May 10

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టు ఇవాళ తాజా ఆదేశాలు జారీ చేసింది. మే 10వ తేదీలోగా మరో వంద కోట్లు తమ రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది. ఇండ్ల నిర్మాణం జాప్యం కావడం వల్ల రియల్ ఎస్టేట్ సంస్థ జయ్‌ప్రకాశ్ అసోసియేట్స్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో సుప్రీం ఆ కేసులో తమ దగ్గర 200 కోట్లు డిపాజిట్ చేయాలని మార్చి 21న కోరింది. అయితే ఇప్పటికే జవనరి 25వ తేదీన జయ్‌పీ సంస్థ 125 కోట్లు డిపాజిట్ చేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం జయ్‌పీ కేసులో ఇవాళ తీర్పును వెలువరించింది. గత ఆదేశాల ప్రకారమే కోర్టు వద్ద ఏప్రిల్ 12న 100 కోట్లు జమ చేసినట్లు సంస్థ తరపున న్యాయవాది వెల్లడించారు. తమ సంస్థ ప్రతినెలకు 500 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లు జయ్‌పీ తెలిపింది. ఇప్పటి వరకు కోర్టు వద్ద మొత్తం 550 కోట్లు డిపాజిట్ చేసినట్లు ఇవాళ సంస్థ తరపున న్యాయవాది తెలిపారు. జయ్‌పీ సంస్థ వద్ద సుమారు 30వేల మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేవలం 8 శాతం మంది మాత్రమే తమ డబ్బు వాపస్ కోరుతున్నారని జయ్‌పీ సంస్థ వెల్లడించింది. మిగితా 92 శాతం మంది కస్టమర్లు తమకు ఇండ్లు కావాలంటున్నారని ఆ సంస్థ కోర్టుకు విన్నవించింది.

1343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS