మ‌సీదులోకి మ‌హిళ‌లు వెళ్లొచ్చా లేదా.. తేల్చ‌నున్న సుప్రీంకోర్టు

Tue,April 16, 2019 12:24 PM

Supreme Court admits Muslim couples plea to allow entry of women in Mosques


హైద‌రాబాద్‌: మ‌సీదుల్లోకి మ‌హిళ‌లు వెళ్ల‌వ‌చ్చా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. ఎటువంటి ఆంక్ష‌లు లేకుండా ఆ అంశంపై పిటిష‌న్‌ను ప‌రిశీలించిన‌ట్లు అత్యున్న‌త న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వానికి, సెంట్ర‌ల్ వ‌క్ఫ్ కౌన్సిల్‌, ఆల్ ఇండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వ‌య‌సుల మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్ల‌వ‌చ్చు అంటూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆ తీర్పు ఆధారంగానే తాము మ‌సీదుల్లోకి ముస్లిం మ‌హిళ‌లు వెళ్ల వ‌చ్చా లేదా అన్న అంశాన్ని తేల్చాల‌ని భావిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ జంట వేసిన పిటిష‌న్‌ను కోర్టు విచారించాల‌నుకుంటున్న‌ది. మ‌సీదులో పూజ చేయాల‌నుకుంటున్న‌ప్పుడు ఎవ‌రైనా ఆ జంట‌ను అడ్డుకున్నారా లేదా అన్న అంశాన్ని తెలుసుకునేందుకు కోర్టు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించింది. మ‌హిళ‌ల‌ను మ‌సీదులోకి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకోవ‌డం అక్ర‌మ‌మ‌ని పిటిష‌న్‌లో తెలిపారు. అది రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌న్నారు. 14, 15, 21, 25, 29 ఆర్టిక‌ల్స్‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని కూడా పిటిష‌న్‌లో తెలిపారు. మ‌హ్మాద ప్ర‌వ‌క్త కానీ.. ప‌విత్ర మ‌త గ్రంధం ఖురాన్ కానీ.. మ‌హిళ‌లు మ‌సీదుకు వెళ్ల‌రాదు అని చెప్ప‌లేద‌ని పిటిష‌న్‌లో చెప్పారు. స్త్రీపురుషుల‌ను ఖురాన్ వేరుగా చూడ‌లేద‌న్నారు.

3036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles