స‌న్నీ లియోన్ దిష్టి బొమ్మ‌ బాగా ప‌నిచేసింది..Fri,February 16, 2018 03:47 PM

స‌న్నీ లియోన్ దిష్టి బొమ్మ‌ బాగా ప‌నిచేసింది..

సన్నీ లియోన్. ఓ సంచలనం. పోర్న్ స్టార్ నుంచి స్టార్ హీరోయిన్ స్థానానికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదురీదింది. ఇప్పుడు బాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. అయితే.. సన్నీ లియోన్.. ఓ ఏరియాలో పంటలను కాపాడుతున్నది. సన్నీ లియోన్ వల్లనే వాళ్లకు ఈ సారి దిగుబడి కూడా పెరిగింది. అదెలా.. అని నెత్తి గోక్కుంటున్నారా? కాస్త.. వివరంగా చెప్పుకుందామా?

సాధారణంగా పంట పొలాల్లో, ఇంటి ముందు ఏం పెడతారు. దిష్టి బొమ్మను పెడతారు. ఎందుకు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.. ఇంకా అందరి దిష్టి పోవాలని. అంతే కాదు. వాళ్ల దృష్టి కూడా మార్చాలని. పంట పొలాల్లో అయితే.. పక్షులు, ఇతర జంతువుల బారి నుంచి తప్పించడానికి వీటిని అమర్చుతారు. అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు రైతు మాత్రం అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించాడు. దిష్టి బొమ్మలకు బదులుగా సన్నీ లియోన్ ఫోటోలను తన పంటలో పెట్టాడు. అయితే.. ఆయన తన పంటలో సన్నీ ఫోటోలు పెట్టింది పక్షులు రాకుండానో లేదంటే జంతువులు రాకుండానో కాదు. మనుషులు తన పంటను చూసి ఈర్ష్య పడకుండా సన్నీనే చూడాలని. తన పండించే కాలిఫ్లవర్, క్యాబేజీ పంటలపై చెడు చూపు ఉండకూడదని అలా చేశాడు. అయితే.. సన్నీ లియోన్ పుణ్యమాని అతడి దిగుబడి పెరిగిందట.

"ఈ సంవత్సరం 10 ఎకరాల్లో కాలిఫ్లవర్, క్యాబేజీ పంట వేశాను. అయితే... మా ఊర్లోని వాళ్లంతా నా పంటలను చూసి కుళ్లుకుంటున్నారు. ఎలాగైనా చెడు చూపు నుంచి నా పంటను రక్షించుకోవాలనుకున్నాను. అందుకే సన్నీ లియోన్ ఫోటోలను ఇక్కడ అమర్చాను. దీంతో ఆ ట్రిక్ వర్క్ అవుట్ అయింది. అప్పటి నుంచి ఎవరూ నా పంటను చూడట్లేదు. అందరూ సన్నీని చూస్తూ వెళ్లిపోతున్నారు. అంతే కాదు.. సన్నీ ఫోటోల మీద "ఒరేయ్.. నన్ను చూసి ఏడవకు రా", "ఎటు చూస్తున్నావ్, నన్ను చూడు.." అంటూ ఆ ఫోటోలపై రాయించా. దీంతో ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఇదివరకు మామూలు దిష్టి బొమ్మలను పెట్టడం వల్ల నా పంట దిగుబడి సరిగా రాలేదు. కాని.. ఇది పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అయింది. అయితే.. సన్నీ ఫోటోలే పెట్టాలని నేను అనుకోలేదు. కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి.. అందరి దృష్టిని మరల్చేలా.. ఏ ఫోటో అయినా ఉంటే ఇవ్వాలని అడిగా. అంతే.. వాళ్లు నాకు సన్నీ లియోన్ ఫోటో ఇచ్చారు. ఇందులో తప్పుందని నేను అనుకోను. ఇలా సన్నీ లియోన్ ఫోటోలు పెట్టడం కరెక్ట్ కాదని నన్ను ఇప్పటి వరకు ఎవరూ సంప్రదించలేదు. ఎవరూ నన్ను అడగలేదు." అని రైతు చెంచు రెడ్డి తెలిపాడు.

3437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS