శ్రీదేవి, మాధురి దీక్షిత్ ఎలాగో.. సన్నీ లియోన్ కూడా అలాగే!

Mon,June 11, 2018 12:47 PM

Sunny Leone is same as Sridevi and Madhuri Dixit says hardik patel

అహ్మదాబాద్: బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు మద్దతిచ్చాడు పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్. గతంలో ఆమె పోర్న్ స్టార్ అయినంత మాత్రాన ఇప్పటికీ అలాగే చూస్తూ ఉంటే ఈ దేశం ఎప్పటికీ మారదని అతను అన్నాడు. సన్నీ లియోన్‌ను మనం ఎందుకు ఓ నటిగా చూడకూడదు? నర్గిస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లాంటి మిగతా నటీమణుల్లాగే ఆమెను చూడటానికి వచ్చిన సమస్య ఏంటి అని హార్దిక్ ప్రశ్నించాడు. ఆమెను ఇప్పటికీ ఓ పోర్న్ స్టార్‌లాగే చూస్తున్నాం. ఇలా అయితే ఈ దేశం ఎప్పటికీ మారదు అని అతను స్పష్టంచేశాడు. ఇండోర్‌లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సన్నీ లియోన్ గురించి ప్రశ్నించిన సమయంలో హార్దిక్ ఇలా స్పందించాడు.

ఈ మధ్య వెలుగు చూసిన రూ.2 వేల కోట్ల విలువైన బిట్ కాయిన్ స్కామ్‌లో సన్నీ లియోన్ పేరు కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కామ్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సన్నీని ప్రశ్నించే అవకాశం ఉంది. బిట్‌కాయిన్ స్కామ్‌కు మూలమైన అమిత్ భరద్వాజ్‌కు చెందిన కంపెనీని ప్రమోట్ చేసినవాళ్లలో సన్నీ కూడా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఓ యాత్ర చేయనున్నట్లు ప్రకటించడానికి ఇండోర్ వచ్చిన హార్దిక్ పటేల్.. సన్నీకి మద్దతుగా మాట్లాడాడు. గతంలోనూ ఆమెను సపోర్ట్ చేస్తూ అతను వ్యాఖ్యలు చేశాడు.

2174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles