తదుపరి సీఈసీగా సునీల్ అరోరా

Tue,November 27, 2018 09:46 AM

Sunil Arora Is Next Election Panel Chief

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా సునీల్ అరోరా(62) నియమితులయ్యారు. ఈ మేరకు అరోరా నియామానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. ప్రస్తుతం దేశ ఎన్నికల ప్రధానాధికారిగా ఓపీ రావత్ ఉన్నారు. డిసెంబర్ 2న రావత్ నుంచి సునీల్ అరోరా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2017, సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషనర్(ఈసీ)గా అరోరా నియమితులయ్యారు. 1980వ ఐఏఎస్ బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన అరోరా ఆర్థికశాఖ, టెక్స్‌టైల్స్ మంత్రిత్వశాఖల్లో, ప్రణాళిక సంఘంలో పలు కీలక పదవులు నిర్వహించారు. సమాచార, నైఫుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వశాఖల్లోనూ కార్యదర్శిగా సేవలందించారు. 1999-2002వరకు పౌర విమానయాన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు ఐదేండ్లపాటు సునీల్ అరోరా సీఎండీగా వ్యవహరించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రికి కార్యదర్శిగా(1993-98), ప్రిన్సిపల్ సెక్రటరీగా(2005-08) విధులు చేపట్టారు.

782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles