కాంగ్రెస్‌కు షాక్‌.. స్వతంత్య్ర అభ్యర్థిగా సుమలత పోటీ

Mon,March 18, 2019 12:53 PM

Sumalatha will contest from Mandya as an independent candidate

బెంగళూరు : 17వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సినీ నటి, మాజీ కాంగ్రెస్‌ నాయకుడు దివంగత అంబరీష్‌ సతీమణి సుమలత ప్రకటించారు. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్‌ అభ్యర్థికి కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల కార్యకర్తల మనోైస్థెర్యం దెబ్బతింటుందని సుమలత గతంలోనే ప్రకటించారు. మొత్తానికి కాంగ్రెస్‌ నుంచి ఆమెకు టికెట్‌ దక్కకపోవడంతో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే గత వారం బీజేపీ సీనియర్‌ నేత ఎంఎస్‌ కృష్ణతో సుమలత భేటీ అయి పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. నాడు ఆమె మాట్లాడుతూ.. కుదిరితే బీజేపీ లేదంటే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు. తుది నిర్ణయాన్ని 18వ తేదీన ప్రకటిస్తానని చెప్పిన సుమలత.. మొత్తానికి తన నిర్ణయాన్ని ఇవాళ వెల్లడించారు ఆమె. సుమలత భర్త అంబరీష్‌ గతేడాది నవంబర్‌ 24న మృతి చెందిన సంగతి తెలిసిందే.

2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles