లోక్‌సభకు నటి సుమలత ఇండిపెండెంట్‌గా పోటీ?

Thu,March 7, 2019 05:50 PM

Sumalatha to contest mandya Ls seat as independent?

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నటి సుమలత పోటీపై రగడ నడుస్తున్నది. నటుడు, రాజకీయనేత అయిన దివంగత అంబరీశ్ భార్య అయిన సుమలతకు కాంగ్రెస్ టికెట్‌పై కొంతకాలంగా ఊహాగానాలు నడిచాయి. ఆమెకు కాంగ్రెస్ కర్నాటకలోని మాండ్యా సీటును కేటాయిస్తుందని ప్రచారం జరిగింది. అయితే కర్నాటక సంకీర్ణ కూటమి అధినేత సిద్ధరామయ్య అలాంటి ఆలోచన ఏదీ లేదని ఇటీవల కొట్టిపారేశారు. ఆ తర్వాత మాండ్యాలో సుమలత పోస్టర్లు వెలిశాయి. ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని వాటిలోని సారాంశం. అంబరీశ్ అభిమానులు వాటిని వేశారు. సుమలత అభ్యర్థిత్వాన్ని సమర్థించినందుకు పార్టీ అధినాయకత్వం తమకు చీవాట్లు పెట్టిందని మాండ్యా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సుమలతకు మద్దతు కొనసాగిస్తే క్రమశిక్షణ చరలు తప్పవని కూడా బెదిరించారట. కొందరు మాత్రం ఏం జరిగినా అంబరీశ్ కుటుంబం వెంటే ఉంటామని అంటున్నారు. మరోవైపు సుమలత మాండ్యా కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు, దేవాలయాల యాత్ర జోరుగా కొనసాగిస్తున్నారు. శ్రీరంగపట్న పర్యటనలో భాగంగా బుధవారం ఆమె రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు మాండ్యా సీటు కేటాయించపోతే ఆమె నిజంగానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి.

2621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles