సముద్రంలో తేలిన సూట్‌కేసు..తెరిచి చూస్తే..

Tue,December 3, 2019 05:42 PM


ముంబై: మహారాష్ట్రలో బాబా మఖ్దూమ్ షా బాబా దర్గాకు పక్కనే ఉన్న సముద్రం నీటిలో బ్లాక్ అండ్ వైట్ సూట్‌కేస్ తేలియాడుతూ కనిపించింది. సూట్‌కేసును గమనించిన స్థానిడొకరు పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు ఆ సూట్‌కేస్ ను ఒడ్డుకు తీసుకువచ్చి చూడగా.. అందులో గుర్తు తెలియని వ్యక్తి శరీర అవయవాలున్నాయి. సూట్‌కేసులో ఎడమచేయి, కుడి కాలు, జననాంగాలున్నట్లు గుర్తించారు. ఫోరెన్సిక్ వైద్య పరీక్షల నిమిత్తం శరీర భాగాలను సియోన్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

5956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles