రాహుల్‌కు బ్రాహ్మ‌ణ‌ అమ్మాయితో పెళ్లి చేయమన్నాను..

Fri,July 6, 2018 01:51 PM

Suggested Sonia Gandhi to get Rahul married to a good Brahmin girl, says TDP MP JC Diwakar Reddy


న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి గురించి ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ మంత్రిగా చేసిన ఆయన .. అప్పటి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బ్రాహ్మణుల మద్దతు కావాలని, ఆ రాష్ర్టానికి చెందిన ఓ మంచి బ్రాహ్మణ అమ్మాయిని చూసి, రాహుల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని సోనియాకు సూచించినట్లు జేసీ తెలిపారు. యూపీలో బ్రాహ్మ‌ణ‌ కమ్యూనిటీదే పైచేయిగా నడుస్తోందని, అందుకే బ్రాహ్మ‌ణ‌ కులానికి చెందిన పిళ్లను రాహుల్‌కు ఇచ్చి పెళ్లి చేయమని గుర్తు చేసినట్లు ఆయన తెలిపారు. కానీ తన సలహాలు, సూచనలను సోనియా పట్టించుకోలేదని ఆయన అన్నారు. జూలై 4న జరిగిన ఓ కార్యక్రమంలో జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రాహుల్ గాంధీ పెళ్లిపై అనేక వదంతులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల రాయ్‌బరేలీ ఎమ్మెల్యే సదర్ అదితి సింగ్.. కాంగ్రెస్ చీఫ్‌కు ప్రపోజ్ చేసినట్లు వార్తలు వ్యాపించాయి. అయితే రాహుల్ తనకు సోదరుడి లాంటి వాడని ఆమె ఆ వార్తల్ని కొట్టిపారేశారు. రాహుల్, అదితి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.2911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles