పీఎస్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

Fri,March 16, 2018 09:54 AM

sub inspector committed suicide in Gaya ps


పాట్నా: బీహార్‌లోని గయ జిల్లాలో సబ్‌ఇన్‌స్పెక్టర్ గౌరీశంకర్ ఠాకూర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గయలోని పోలీస్‌స్టేషన్‌లో గౌరీశంకర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఉన్నతాధికారులు తన సెలవు అభ్యర్థనను తిరస్కరించడంతో మనస్థాపానికి గురైన ఎస్‌ఐ గౌరీశంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్‌ఐ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles