రేపు 'స్టడీ ఇన్ ఇండియా' పోర్టల్ ఆవిష్కరణTue,April 17, 2018 05:13 PM

Study in India portal launch tomorrow

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలుకుతోంది. స్టడీ ఇన్ ఇండియా పోర్టల్(www.studyinindia.gov.in)ను కేంద్ర ప్రభుత్వం రేపు ఆవిష్కరించనుంది. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, హెచ్‌ఆర్‌డీ సహాయ మంత్రి డా. సత్యపాల్ సింగ్, ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ పోర్టల్ ద్వారా సౌత్ ఏషియా, ఆఫ్రికా, సీఐఎస్, మిడిల్ ఈస్ట్‌కు చెందిన 30 దేశాల విద్యార్థులు భారత్‌లో విద్యనభ్యసించవచ్చు. న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ పొందిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంపిక చేసిన 150 కోర్సుల్లో వీరు చేరవచ్చు. 80 దేశాలకు చెందిన రాయబారులను పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు.

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS