రేపు విద్యార్థులు క్యాంపస్‌కు రావొద్దు..

Tue,February 13, 2018 02:53 PM

Students not to come on Valentines Day says Lucknow University


లక్నో: రేపు వాలంటైన్స్ డే సందర్భంగా విద్యార్థులు క్యాంపస్‌లోకి రావొద్దని లక్నో యూనివర్సిటీ అడ్వైజరీ జారీచేసింది. వాలంటైన్స్ డేతోపాటు మహాశివరాత్రి సందర్భంగా రేపు యూనివర్సిటీకి సెలవు ప్రకటించామని..ఈ నేపథ్యంలో విద్యార్థులెరూ క్లాసుల్లోగానీ, క్యాంపస్ ప్రాంగనంలో కానీ కనిపించొద్దని యూనవర్సిటీ అధికారులు నోటీసులు అంటించారు. గతంలో కొంతమంది విద్యార్థులు వాలంటైన్స్ డే సమయంలో సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించారని యూవవర్సిటీ అధికారి వినోద్ సింగ్ తెలిపారు. రేపు ఎలాంటి తరగతులుకానీ, సాంస్కృతిక కార్యక్రమాలుకానీ నిర్వహించలేదనే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుర్తుంచుకుని..తమకు సహకరించాలని వినోద్ సింగ్ కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

2592
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles