విద్యార్థి నాయకుడు దారుణ హత్య

Tue,February 26, 2019 11:53 AM

Student Leader Killed in Front of Hostel in Varanasi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం జరిగింది. ఉదయ్ ప్రతాప్ కాలేజీకి చెందిన విద్యార్థి నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అజాంఘర్ జిల్లాకు చెందిన వివేక్ సింగ్(22) బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి క్యాంపస్ హాస్టల్ ఎదుట వెళ్తున్న వివేక్ సింగ్‌పై కొందరు దుండగులు .32 బోర్ పిస్తోల్‌తో కాల్పులు జరిపి పరారీ అయ్యారు. రక్తపు మడుగులో పడిన వివేక్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివేక్‌ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles