అది క్యాట్ వాక్ కాదు.. డాగ్ వాక్.. వైరల్ వీడియో

Fri,January 18, 2019 03:30 PM

Stray dog crashes Sidharth Malhotra ramp walk at fashion show in mumbai

సాధారణంగా జరిగే క్యాట్ వాక్‌లను చూసుంటారు కానీ.. ఈ డాగ్ వాక్‌ను మాత్రం ఖచ్చితంగా చూసి ఉండరు. ఎందుకంటే.. కుక్కలు ర్యాంపుల మీద వయ్యారాలు ఒలకవు కదా. కానీ.. ఓ కుక్క ర్యాంపులపై హొయలు ఒలికే మోడల్స్‌తో కలిసి ఫోటోలను పోజులిచ్చింది. ఈ చిలిపి ఘటన ప్రముఖ డిజైనర్ రోహిత్ బాల్ ఫ్యాషన్ షో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2018లో చోటు చేసుకున్నది. ముంబైలో జరిగిన ర్యాంప్ వాక్‌లో బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్త్ మల్హోత్రా, నటి డయానా పెంటీ పాల్గొన్నారు. సిద్ధార్త్, డయానా, మిగితా మోడల్స్ అంత డిజైనర్ రోహిత్ డిజైన్ చేసిన డ్రెస్సులు వేసుకొని ర్యాంప్‌పై నడవడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే ర్యాంపు మీద ఓ కుక్క ప్రత్యక్షమైంది. మోడల్స్ పక్కన నిలబడి వాళ్లతో ఫోటోలకు పోజులిచ్చింది. అనంతరం ర్యాంపుపై నడిచింది. దాన్ని గమనించిన సిబ్బంది అక్కడి నుంచి తరిమేశారు. ఆ తర్వాత సిద్ధార్థ్ ర్యాంపుపై నడిచాడు.
2566
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles