6 ఏళ్ల వయస్సులో వేశ్యా గృహానికి అమ్మబడిన‌ ఓ యువతి రియల్ స్టోరీ ఇది..!

Tue,April 11, 2017 11:14 AM

story of a girl who sold to brothel house at the age of 6 years

చదువు సంధ్యలతో, ఆటపాటలతో సరదాగా గడపాల్సిన చిన్న వయస్సు ఆ బాలికది. అలాంటి వయస్సులో పగవాడికి కూడా రాకూడదనుకునే కష్టం ఆమెకు వచ్చింది. ఆమె తల్లిదండ్రులే ఆమెను బ్రోతల్ హౌస్‌కు అమ్మేశారు. 6 ఏళ్లు ఉన్న ఆ బాలికకు అప్పుడు తనకు ఏం జరిగిందో తెలియదు. క్రమంగా నరకాన్ని మించిన అంధకార కూపంలోకి ఇరుక్కుపోయింది. కొన్నేళ్ల పాటు అందులోనే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటూ 5 ఏళ్ల పాటు కాలం వెళ్లదీసింది. చివరకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆ కూపం నుంచి బయట పడి ఇప్పుడు తన కాళ్లపై తాను నిలబడేందుకు యత్నిస్తోంది. ఉన్నత లక్ష్య సాధన దిశగా విద్యనభ్యసిస్తూ ముందుకు సాగుతోంది. అంతేకాదు, అభం శుభం తెలియని వయస్సులో తనను అన్ని చిత్రహింసలు పెట్టిన వారికి శిక్ష పడేలా చేస్తానని చెబుతోంది. కోల్‌కతాకు చెందిన ఓ యువతి దీన గాథే ఇది..!

ఆమె పేరు ఇషిక. ఉంటున్నది కోల్‌కతాలో. ఆమెకు 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రులే అమానుషంగా ప్రవర్తించారు. ఇషికను కోల్‌కతాలోని ఓ బ్రోతల్ హౌస్‌కు అమ్మేశారు. దీంతో అప్పుడు ఇషికకు ఏమవుతుందో అర్థం కాలేదు. కానీ ఆ నరక కూపంలోకి వెళ్లాకే అంతా తెలిసింది. అక్కడి నుంచి బయటకు తప్పించుకుందామని అనుకుంది. అది వీలు కాలేదు. ఎన్నో కష్ట నష్టాల నడుమ అందులోనే 5 ఏళ్ల పాటు ఎలాగో గడిపింది. అయితే ఓ రోజున పోలీసులు జరిపిన దాడిలో ఆమె రక్షించబడింది. అనంతరం ఆమెను సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలిగా పోలీసులు గుర్తించారు. దీంతో వారు ఆమెను సన్‌లాప్ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అక్కడే ఇషికకు కొత్త జీవితం మొదలైంది. అప్పుడామెకు 11 ఏళ్లు మాత్రమే.

సన్‌లాప్ స్వచ్ఛంద సంస్థలో ఇషికకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. ఆమెకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు. మళ్లీ కొత్త జీవితం ప్రారంభించేందుకు అవసరమైన భరోసాను వారు కల్పించారు. దీంతో ఎట్టకేలకు ఆమె తనకు తగిలిన షాక్ నుంచి బయట పడింది. అలా కొన్నేళ్లు గడిచాయి. ఆ తరువాత ఫ్రీ ఎ గర్ల్ అనే మరో స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఇషిక విద్యనభ్యసించడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడామె లా కోర్సులో చేరేందుకు అవసరమైన ప్రవేశ పరీక్షను రాసేందుకు ప్రిపేర్ అవుతోంది. అయితే ఆమె లా కోర్సునే చేసేందుకు ఓ కారణం ఉంది. అదేమిటంటే... తనను ఆ బందిఖానాలోకి దింపిన వ్యక్తులకు ఎలాగైనా శిక్ష పడేలా చేస్తానని, తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానని ఆమె అంటోంది..!

2459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles