సీఎం చౌహాన్‌పై రాళ్ల వర్షం

Mon,September 3, 2018 12:21 PM

Stones thrown at CM Shivraj Singh Chouhans vehicle

సిద్ధి: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లతో దాడి చేశారు. సిద్ధ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రచార వాహనంలో సీఎం చౌహాన్ ఉన్న సమయంలో .. అక్కడకు వచ్చిన జనం ఆ వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సీఎం చౌహాన్ గాయపడలేదని స్థానిక పోలీసులు తెలిపారు. చురహట్ ఏరియా సమీపంలో సీఎం చౌహాన్‌పై రాళ్ల వర్షం కురిసింది. ప్రతిపక్షనేత అజయ్ సింగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన సీఎం చౌహాన్.. ప్రతిపక్ష నేత అజయ్ సింగ్‌పై విమర్శలు చేశారు. దమ్ముంటే తనపై గెలవాలని చౌహాన్ సవాల్ చేశారు.1524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles