లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Mon,May 27, 2019 05:06 PM

Stock Markets ended with profit

ముంబయి: వరుసగా రెండో సెషన్‌లో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఈ నెల 24న సెన్సెక్స్ 643 పాయింట్లు లాభపడింది. ఈ రోజు మరో 249 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 39,536 పాయింట్ల వద్ద సూచి ప్రారంభమైంది. మొదట్లో సూచి కాసేపు హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో 39,353 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షిణించింది. తరువాత కొనుగోళ్ల మద్దతుతో 29,822 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. చివరకు రికార్డు స్థాయి 39,683 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 11925 పాయింట్ల వద్ద ముగిసింది.

541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles