స్టీల్ బుల్లెట్లు వాడుతున్న క‌శ్మీర్ ఉగ్ర‌వాదులు !

Thu,June 20, 2019 03:37 PM

Steel bullets, used by terrorists in Anantnag attack, worry authorities

హైద‌రాబాద్‌: క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు స్టీల్ బుల్లెట్లు వాడుతున్నారు. ఇది ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశ‌మ‌ని అధికారులు చెప్పారు. జూన్ 12వ తేదీన సీఆర్‌పీఎఫ్ ద‌ళంపై దాడి జ‌రిగింది. అయితే ఆ దాడిలో ఉగ్ర‌వాదులు స్టీల్ బుల్లెట్లు వాడిన‌ట్లు తేలింది. అవి కూడా మేడ్ ఇన్ చైనా బుల్లెట్లు అని అధికారులు తేల్చారు. జ‌వాన్లు ధ‌రించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి ఆ స్టీల్ బుల్లెట్లు దూసుకువెళ్లాయ‌ని, అందుకే జ‌వాన్లు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. కాల్పులను తిప్పికొట్టే స‌మ‌యంలో ఉగ్ర‌వాదుల నుంచి ఓ ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ చోటు నుంచే కొన్ని రౌండ్ల‌కు స‌రిప‌డే స్టీల్ బుల్లెట్ల‌ను కూడా సీజ్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ, జైషే మొహ్మ‌ద్‌లు స్టీల్ బుల్లెట్ల‌ను ఉగ్ర‌వాదుల‌కు అందిస్తున్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

2381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles