నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలు ఎత్తివేసిన ఎస్బీఐ

Fri,July 12, 2019 03:21 PM

State Bank of India waives off IMPS, NEFT and RTGS charges

హైద‌రాబాద్‌: ఆన్‌లైన్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎత్తివేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇవాళ ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది. ఇమిడియేట్ పేమెంట్ స‌ర్వీస్‌(ఐఎంపీఎస్‌), నెఫ్ట్‌, ఆర్టీజీఎస్ లాంటి లావాదేవీల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని బ్యాంక్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఐఎంపీఎస్ చార్జీలు ఇక నుంచి వ‌సూల్ చేయ‌రు. యోనో యాప్ ద్వారా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసే వారికి చార్జీలు ఉండ‌వు. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఐఎన్‌బీ, మొబైల్ బ్యాంకింగ్ కూడా చార్జీలు ఉండ‌వు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా జరిపే లావాదేవీలపై విధించే చార్జీలను జూలై 1 నుంచి ఎత్తివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ గ‌త నెల‌లో ప్రకటించింది. ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ ఖాతాదారులకు అందించాలని ఆర్బీఐ సూచించింది. నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు పంపుకోనుండగా, అదే ఆర్టీజీఎస్ ద్వారా ఎంతైన పంపుకోవచ్చును. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రతి నెఫ్ట్ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.5 వరకు వడ్డీస్తుండగా, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నది. ఈ నెల 6న తన పరపతి సమీక్షలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది.972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles